(Local) Sun, 26 Jan, 2020

స్విస్ ప్రభుత్వ పరం కానున్న భారతీయుల సొమ్ము

November 12, 2019,   12:13 PM IST
Share on:
స్విస్ ప్రభుత్వ పరం కానున్న భారతీయుల సొమ్ము

సుదీర్షకాలం పాటు ఎలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణంగా ఉన్న స్విస్ బ్యాంకు ఖాతాలు తమకు సంబంధించినవేనంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిలోని సొమ్ము స్విట్టర్లాండ్‌ ప్రభుత్వపరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి భారతీయులకు చెందిన దాదాపు పది ఖాతాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వారు ముందుకు వచ్చి సొమ్మును తీసుకోవచ్చంటూ 2015లోనే ప్రకటన విడుదల చేసినా స్పందన లభించలేదు. సొమ్మును క్లెయిం చేసుకోవడానికి కొన్ని ఖాతాలకు ఉన్న చివరి గడువు వచ్చే నెలాఖరులో ముగియనుండగా, మరికొన్నింటికి వచ్చే ఏడాది చివరి వరకు గడువు ఉంది. స్విట్టర్లాండ్‌లోని నిబంధనల ప్రకారం ఏ ఖాతాదారుడైనా 60 ఏళ్ల పాటు బ్యాంకుతో సంబంధాలు నెరపకపోతే ఆ సొమ్ము ప్రభుత్వ పరం అవుతుంది. కొన్ని ఖాతాల్లో అయితే 1954 నుంచి ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాల్లోని సొమ్ము  స్విట్టర్లాండ్‌ ప్రభుత్వపరం కానుంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.