(Local) Mon, 21 Oct, 2019

రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

September 14, 2019,   9:00 PM IST
Share on:
రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడదామని పవన్ కల్యాణ్ రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నెల 16న జరిగే అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ ను పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. సమావేశానికి హాజరవుతానని పవన్ కల్యాణ్ తో రేవంత్ చెప్పినట్లు తెలస్తోంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 16  ఉ.10 గంటలకు దస్ పల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇందుకు రేవంత్ రెడ్డి వస్తున్నట్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన యురేనియం తవ్వకాల ప్రతిపాదనపై కాంగ్రెస్ ఇప్పటికే పోరాటం చేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే యూరేనియం తవ్వకాలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకున్నారు.కాంగ్రెస్ కూడా ఇదే విషయమై వీహెచ్ నేతృత్వంలో కమిటీ వేసింది. యూరేనియం తవ్వకాలు సాగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని, కొందరు పిచ్చివాళ్లు అవుతారని, వికలాంగులు అవుతారని, ఎక్స్ పర్ట్స్ ను పిలిచి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. అందులో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. 

సంబంధిత వర్గం
ప్రగతి భవన్ ముట్టడి - రేవంత్ రెడ్డి అరెస్ట్
ప్రగతి భవన్ ముట్టడి - రేవంత్ రెడ్డి అరెస్ట్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.