(Local) Fri, 06 Dec, 2019

“జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” - పవన్ కళ్యాణ్

November 17, 2019,   11:15 AM IST
Share on:
“జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” - పవన్ కళ్యాణ్

“జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” అంటూ ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ కార్టూన్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. జగన్‌ కార్టూన్‌లో రెండు కాళ్లకు రెండు బస్తాలు కట్టి ఉండగా ఒక కాలుకు కట్టి ఉన్న బస్తాలో ఇసుక అని రాసి ఉంది. మరో బస్తాపై ఎలాంటి రాతలు లేవు. ఇదే కార్టూన్‌ను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ఇసుకు విధానం గురించి చెప్పాలనుకుంటున్నది కార్టూన్‌ ద్వారా స్పష్టమవుతోంది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు వైఎస్‌ఆర్‌సిపిని గెలిపిస్తే 35 లక్షల మంది భవననిర్మాణ కార్మికుల ఉపాధిని జగన్ సర్కార్ తొలగించిందని మండిపడ్డారు. 50 మంది కార్మికుల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వం కారణమైందని ట్విటర్‌లో విరుచుకుపడ్డారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.