(Local) Mon, 21 Oct, 2019

కోడెల మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది - పవన్ కళ్యాణ్

September 16, 2019,   5:06 PM IST
Share on:
కోడెల మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది - ...

కోడెల శివప్రసాద్ రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఎన్నో పదవులను అలంకరించారు. కానీ రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు, విమర్శలు తట్టుకోలేక ఆయన బలవన్మరణానికి పాల్పడడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు .తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఈ ఆపత్కాల సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున తీవ్రసంతాపం తెలియచేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్  తెలిపారు..

సంబంధిత వర్గం
నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ
నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.