(Local) Mon, 20 Sep, 2021

సౌదీ అరేబియా చేరుకున్న మోడి

October 29, 2019,   12:42 PM IST
Share on:
సౌదీ అరేబియా చేరుకున్న మోడి

రెండు రోజుల పర్యటనకు గాను సౌదీ అరేబియాకు వెళ్లిన మోడి ,సౌదీ రాజధాని రియాద్ కు చేరుకున్నారు .అక్కడ  మోడికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా మూడవ హైప్రొఫైల్ ఫైనాన్సియల్ కాన్ఫరెన్స్ లో మోడి పాల్గొంటారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో కూడా పాల్గొంటారు. ఈ చర్చల్లో మోడితో పాటు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ లు పాల్గొంటారు.

రియాద్ చేరుకున్న తర్వాత మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘సౌదీ అరేబియా చేరుకున్నా. గొప్ప మిత్ర దేశమైన సౌదీతో బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ పర్యటన సందర్భంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను’ అని తెలిపారు. మోడి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ప్రధానంగా చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, పౌర విమానయానం తదితర కీలక అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.