(Local) Sun, 08 Dec, 2019

శబరిమలలో 15 నుంచి ప్రారంభం కానున్న పూజలు

November 13, 2019,   3:31 PM IST
Share on:
శబరిమలలో 15 నుంచి ప్రారంభం కానున్న పూజలు

కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ నెల 15 నుంచి పూజలు ప్రారంభం కానుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు 10,017 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 30 వరకు జరిగే తొలి దశ వేడుకకు సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎరుమెలి వద్ద 2,551 మంది, 30 నుంచి వచ్చే నెల 14 వరకు జరిగే రెండో దశ వేడుకకు 2,539 మంది, మూడో దశలో 2,992 మంది, నాలుగో దశలో 3,077 మంది చొప్పున బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరితోపాటు సన్నిధానం, నిలక్కల్, పంబ వద్ద కూడా అదనంగా 1,560 మంది ప్రత్యేక బలగాలను మోహరించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.