(Local) Mon, 21 Oct, 2019

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?

September 14, 2019,   9:56 AM IST
Share on:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలని సోనియా గాంధీ పై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నందున పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగిస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం సోనియాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ సీఎంల సమావేశం జరిగింది. బీజేపీని ఎదుర్కొవాలంటే రాహుల్, ప్రియాంక లలో ఎవరో ఒకరు మాత్రమే అధ్యక్షులు కావాలని వారు సూచించారు. వేరే వారికి పగ్గాలు అప్పగిస్తే అది పార్టీ పై ప్రభావం చూపుతుందని వారు సోనియా గాంధీకి వివరించారు. రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్దంగా లేనందున ఆలోచించకుండా ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, చత్తీస్‌గఢ్ సీఎం భూషేశ్ బఘేల్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ బలపడకుండా చూడాలని సోనియాగాంధీ వారికి సూచించారు.

సంబంధిత వర్గం
ప్రగతి భవన్ ముట్టడి - రేవంత్ రెడ్డి అరెస్ట్
ప్రగతి భవన్ ముట్టడి - రేవంత్ రెడ్డి అరెస్ట్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.