(Local) Mon, 20 Sep, 2021

జపాన్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

September 03, 2019,   11:07 AM IST
Share on:
జపాన్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తూర్పు ఆసియా దేశాల ఐదు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌ చేరుకున్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సెఫ్టెంబర్‌ 28 తేదీల్లో రెండు రోజుల జపాన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కలిసి కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య రక్షణపరమైన, వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం ఆయన జపాన్‌ ప్రధాని షింజో అబేను కలవనున్నట్లు సమాచారం. గత ఐదేళ్ల కాలం నుంచి జపాన్‌ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని మోదీ మధ్య మంచి స్నేహ పూర్వక వాతావరణం కొనసాగుతున్నట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్‌ 5,6 తేదీల్లో దక్షిణకొరియాకు పర్యటనకు వెళ్లనున్న రాజ్‌నాథ్‌ దక్షిణ కొరియాలో రక్షణ మంత్రి జియోంగ్‌ కియోంగ్‌తో సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని లీనాక్‌యోన్‌ను కలవనున్నారని సమాచారం. అనంతరం సియోల్‌లో జరగనున్న బిజినెస్  టు గవర్నమెంటు సీఈవోల సదస్సుకు ఇరు దేశాల రక్షణ మంత్రులు హాజరుకానున్నారు

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.