(Local) Mon, 20 Sep, 2021

సరిహద్దుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన

November 16, 2019,   12:03 PM IST
Share on:
సరిహద్దుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం ఉదయం చైనా దేశ సరిహద్దుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ ఇండో-చైనా సరిహద్దు ప్రాంతమైన బుమ్లా పాస్ వద్ద రాజ్‌నాథ్‌సింగ్ భారతసైనికులను కలిసి మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికులను కేంద్రమంత్రి అభినందించారు. దేశ సరిహద్దుల్లో సైనికులను కలిసే అవకాశం తనకు లభించిందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో పరిస్థితిని పరిశీలించిన కేంద్రమంత్రి సైనికులతో ముచ్చటించారు. అనంతరం సైనికులతో కలిసి సరిహద్దుల్లో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని సైనికులు తనకు చెప్పారని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.