(Local) Tue, 17 Sep, 2019

యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చెయ్యాలి -రేవంత్ రెడ్డి

August 18, 2019,   12:11 PM IST
Views: 55
Share on:
యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు ...

యురేనియం తవ్వితే గుండెల్లో గునపం దింపుతామని  మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నల్లమలలో యురేనియం అన్వేషణ అనుమతుల నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలంలో పర్యటించిన . ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ. నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తవ్వకాలకు సహకరిస్తున్న టిఆర్‌ఎస్‌, బిజెపి నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలని సూచించారు. యురేనియం తవ్వకాలు జరగడంలేదంటూ సిఎం కెసిఆర్‌ హామీ ఇవ్వాలని, హామీ ఇచ్చేంతవరకు పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. నల్లమల అడవి బిడ్డలను తాను అండగా నిలుస్తానని, నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని రేవంత్ హెచ్చరించారు.

సంబంధిత వర్గం
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు
మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ పొత్తు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.