(Local) Mon, 01 Mar, 2021

శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి

October 18, 2019,   1:49 PM IST
Share on:
శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో డెంగీ, విష జ్వరాలు ప్రబలి ఇప్పటికే చాలామంది మృత్యువాత పడ్డారు. దీంతో గిరిజన, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, మరెవ్వరూ డెంగ్యూతో చనిపోవద్దని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ప్రజలలో విష జ్వరాలపై చైతన్యం కల్పించాలని, డాక్టర్లు అందుబాటులో ఉండాలని, కావాల్సిన మందులు పంపిణీ చేయాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందించే సాయాన్ని వెంటనే చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.