(Local) Mon, 20 Sep, 2021

ఇంధన ధరలు చుక్కలనంటుతాయి; సౌదీ రాజు హెచ్చరిక

October 01, 2019,   11:08 AM IST
Share on:
ఇంధన ధరలు చుక్కలనంటుతాయి; సౌదీ రాజు హెచ్చరిక

ఇంధన ధరలపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ఇరాన్ ను ప్రపంచ దేశాలు కలిసి అరికట్టలేకుంటే గరిష్ట స్థాయికి ఇంధన ధరలు పెరిగి, చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడతుందని పేర్కొన్నారు. ఇరాన్ తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి తీవ్ర నష్టం వస్తుందని, ఈ నేపథ్యంలో ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలిగి మునుపెన్నడు చూడనంత గరష్ట స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ కార్యక్రమ ఇంటర్వ్యూలో మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.