(Local) Mon, 21 Oct, 2019

పోలీసుల దిగ్బంధంలో యాదాద్రి

September 07, 2019,   2:12 PM IST
Share on:
పోలీసుల దిగ్బంధంలో యాదాద్రి

యాదాద్రి ఆలయ స్తంభాలపై అత్యుత్సాహంతో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలు చెక్కడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాన ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల బొమ్మలు ఉండడంపై ప్రతి ప్రక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదాద్రి ఆలయంలో రాజకీయ నాయకుల చిత్రాలను చెక్కి ఆలయ పవిత్రతను నాశనం చేస్తున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కొండపైన నిరసనలు వ్యక్తం చేశాయి. యాదాద్రి ఆలయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాదాద్రి కొండా పైన, కింద మోహరించి ఆలయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నిరసన కారులు, అనుమతి లేని వాహనాలు కొండపైకి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత వర్గం
కేసీఆర్‌ పై నిప్పులు చెరిగిన  డీకే అరుణ
కేసీఆర్‌ పై నిప్పులు చెరిగిన డీకే అరుణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.