(Local) Wed, 16 Oct, 2019

భారత్ లో 5జీ నెట్ వర్క్ ఇప్పట్లో లేనట్లే.... !

September 24, 2019,   12:41 PM IST
Share on:
భారత్ లో 5జీ నెట్ వర్క్ ఇప్పట్లో లేనట్లే.... !

5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. త్వరలో మనదేశంలో హైస్పీడ్ 5జీని ఎంజాయ్ చేయవచ్చనుకుంటున్నారా? అయితే మీరు మరి కొంతకాలం ఎదురుచూడక తప్పదు.సెల్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్ల వైపు పరుగులు తీస్తుంటే త్వరలో 5జీని ఎంజాయ్ చేయవచ్చు అనుకునే వాళ్లలో మీరు కూడా ఉన్నారా?. అయితే మీలాంటి వారికి మరింత బాధాకరమైన వార్త. మనదేశంలో 5జీ అందుబాటులోకి వచ్చేసరికి మరో 5-6 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు. అదేంటి... త్వరలో 5జీ వచ్చేస్తోందని ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి కదా.. అనుకుంటున్నారా? ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసింది. దీనికి సంబంధించిన కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదంటే మీరు నమ్ముతారా? అవును! మనదేశం 5జీ స్పెక్ట్రంకి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో ప్రయోగాలు కూడా మొదలు కాలేదు.

ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే మనదేశంలో 5జీకి సంబంధించిన స్పెక్ట్రం వేలాల ప్రారంభం అవుతాయని, మరో 100 రోజుల్లో 5జీ సేవలకు సంబంధించిన ట్రయల్స్ కూడా ప్రారంభం అవుతాయని సోమవారం టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన ఆచరణ అంత వేగంగా జరిగేలా కనిపించడం లేదు. 5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలు, మౌలిక వనరులు, స్పెక్ట్రం వంటి కనీస వనరులు ఏవీ అందుబాటులో లేవు.

కానీ భారతదేశ వినియోగదారులకు కొన్ని 5జీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో 5జీ అందుబాటులోకి రావడానికి 2023 వరకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి 2025 వరకు సమయం పడుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.