(Local) Fri, 23 Aug, 2019

రొమ్ము క్యాన్సర్ ను కనిపెట్టే ఓ సరి కొత్త జాకెట్!

July 28, 2019,   12:59 PM IST
Share on:

బ్రెస్ట్‌ క్యాన్సర్ ను కనిపెట్టే ఓ సరి కొత్త జాకెట్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది..
థర్మల్ - ఇమేజింగ్ (శరీర భాగాలను స్కాన్ చేసి చిత్రాలను రూపొందించే) టెక్నాలజీతో పని చేసే ఈ జాకెట్ ను కేంద్ర మంత్రి సంజయ్ ధోత్రే మహారాష్ట్రలోని అకోలా జిల్లా మహిళా ఆసుపత్రికి అందజేశారు..
రొమ్ము క్యాన్సర్ ను సులువుగా కనిపెట్టే సాధనంగా ఇది ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు..
ఎవరికైనా ఈ జాకెట్ ను కొద్ది నిమిషాలపాటు ధరింపజేస్తే.. వారికి రొమ్ము క్యాన్సర్ ఉన్నా, పెరుగుతున్నా వైద్యులు కనిపెట్టేయవచ్చు..
‘భారత్ లో తయారీ’లో భాగంగా దేశంలో ఈ జాకెట్ల తయారీకి ఓ జపాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎలక్ట్రానిక్స్ , ఐటీ విభాగం కార్యదర్శి అజయ్ సాహ్నే తెలిపారు. 
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.