(Local) Mon, 18 Nov, 2019

సరి కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది..

September 05, 2019,   3:43 PM IST
Share on:
సరి కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది..

కొత్త హంగులతో యూజర్ల నెట్ పనులను సులభతరం, వేగవంతం చేస్తున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వెర్షన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ 10(Q)  ను గూగుల్ సంస్థ నిన్న విడుదల చేసింది. ప్రైవసీకి రక్షణ, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లతోపాటు, భవిష్యత్తులో వచ్చే ఫోన్లను కూడా దృష్టిలో ఉంచుకుని దీన్ని తీర్చిదిద్దారు.

ఆండ్రాయిడ్ 10(Q) ఫీచర్స్ :

* మనల్ని డిస్టబర్బ్ చేసే యాప్స్‌ను ఆండ్రాయిడ్ 10 సాయంతో ‘వెల్ బీయింగ్ ఇనిషియేటివ్’ కింద ఆటకట్టించొచ్చు. వాటిని సైలెంట్ ఆప్షన్‌లో పెడితే విసిగించవు. మనకు కావాలనుకున్నప్పుడు మళ్లీ యాక్టివేట్ చేసుకోవచచ్చు. 

* ఆండ్రాయిడ్ 10 సెట్టింగ్స్‌లోకి వెళ్తే లొకేషన్ హిస్టరీ, యాక్టివిటీ కంట్రోల్స్, యాడ్ సెట్టింగ్స్, స్కోప్డ్ స్టోరేజీ వంటివి కనిపిస్తాయి. స్కోప్డ్ స్టోరేజీ సాయంతో ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైసెస్‌ను మాత్రమే వాడుకోవచ్చు. దీంతో ఇంటర్నల్ డేటా సురక్షితంగా ఉంటుంది. కొన్ని యాప్స్‌ పనితీరును నియంత్రించవచ్చు. మనం ఇస్తే తప్ప ఎవరికీ యాక్సెస్ ఉండదు. 

*ఆండ్రాయిడ్ 10లో డార్క్ థీమ్ మన కళ్లను కాపాడుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ సేవింగ్‌ను ఆన్ చేస్తే డార్క్ మోడ్ వస్తుంది. ఫోన్ ఆపరేటింగ్ సిస్టం అందులోకి వెళ్తుంది. సపోర్టెడ్ యాప్స్ కూడా ఆ మోడ్‌లోకి వెళ్తాయి. యాప్‌లకు డార్క్ మోడ్ లేకపోతే ఆండ్రాయిడ్ ఆటోమేటిగ్గా అందులోకి పంపుతుంది. దీంతో బ్యాటరీ లైఫ్ పెరగడంతోపాటు, యూజర్ల కళ్లపై కాంతి ఒత్తిడి తగ్గుతుంది.  

* మనకు అసవరమైన నోటిఫికేషన్లను ఎంచుకోవచ్చు. బబుల్ నోటిఫికేషన్స్ ఫీచర్ ద్వారా నోటిఫికేషన్లు బబుల్స్‌లా వస్తాయి. స్క్రీన్లో వాటిని ఎటువైపుకైనా జరపొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచే ఫోన్‌కు నేరుగా సెక్యూరిటీ అప్‌డేట్లను తీసుకోవచ్చు.

*మెసేజింగ్ యాప్‌ల నుంచి వచ్చే మెసేజీలను ఆండ్రాయిడ్ 10 ఆటోమేటిగ్గా అర్థం చేసుకుని జవాబులు పంపుతుంది. కొత్త చిరునామాలు వస్తే గూగుల్ మ్యాప్‌లో దాని లొకేషన్ ఓపెన్ అవుతుంది.  

*తెరను పూర్తిగా వాడుకోవచ్చు. నావిగేషన్ బార్‌ను పూర్తిగా తీసేసి, బార్ ఫీచర్లను ఫోన్ ఎడ్జ్‌లో సర్దుకోవచ్చు. అలాగే యూట్యూబ్‌లో ఉండే క్యాప్షన్స్ ఫీచర్‌ను వివిధ యాప్స్‌లో వాడుకోవచ్చు. వీడియో, ఆడియోలకు లైవ్ క్యాప్షన్లు తెప్పించుకోవచ్చు. చుట్టుపక్కల రణగొణ ధ్వనులు ఉన్నా,  ఫోన్ సంభాషణ స్పష్టంగా సాగడానికి గెస్చర్ నావిగేషన్ ఫీచర్ పనికొస్తుంది. 

*తల్లిదండ్రులకు పనికొచ్చే ఫీచర్ ఇది. పిల్లలు ఫోన్లో నెట్‌ను ఎంతసేపు వాడుకోవాలి, ఏం చూడాలి వంటి వాటిని మనం నియంత్రించవచ్చు. 

సంబంధిత వర్గం
రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్  చేసిన  ...
రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ...
విపణి లోకి వివో ఎస్1 విడుదల
విపణి లోకి వివో ఎస్1 విడుదల

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.