(Local) Thu, 04 Jun, 2020

డేటాను తస్కరిస్తున్న ఆండ్రాయిడ్‌ యాప్స్‌

July 10, 2019,   12:01 PM IST
Share on:
డేటాను తస్కరిస్తున్న ఆండ్రాయిడ్‌ యాప్స్‌

మన అనుమతులు లేకుండానే పలు ఆండ్రాయిడ్‌ యాప్స్‌ మన ఫోన్లోని డేటాను తస్కరిస్తున్నాయని ఓ సర్వేలో తేలింది.  యూజర్లు అనుమతి నిరాకరించినప్పటికీ.. ఇవి నిబంధనలు ఉల్లంఘించి వ్యక్తిగత సమాచారాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని ఇంటర్నేషనల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌(ఐసీఎస్‌ఐ) అనే సంస్థ తన పరిశోధనలో తెలిపింది. 
ఐసీఎస్‌ఐ తన పరిశోధనలో భద్రతాపరంగా పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. యూజర్లు నో చెప్పినప్పటికీ.. మన వ్యక్తిగత డేటాపై నియంత్రణ కొనసాగించే యాప్స్‌ దాదాపు 1325 ఉన్నట్లు తాము గుర్తించినట్లు పేర్కొంది. లొకేషన్‌ హిస్టరీతోపాటు ఇవి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి యాప్స్‌ పలు రకాలుగా ఫోన్లోని సమాచారాన్ని సేకరిస్తున్నాయని పేర్కొంది.
గూగుల్‌, యాపిల్‌ లాంటి టెక్‌ దిగ్గజాలు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను మెరుగుపరిచి భద్రతాపరమైన ఉల్లంఘనలు జరగకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న గూగుల్‌ ఆండ్రాయిడ్‌ Q ఓఎస్‌ ద్వారా ఇలాంటి చాలా వాటికి పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.