(Local) Sun, 15 Dec, 2019

శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు!

November 22, 2019,   10:49 AM IST
Share on:
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...

పెళ్లివేడుకలను వినూత్నంగా జరుపుకోవడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. వధువు లేదా వరుడు పెళ్లి మండపానికి చేరుకునేందుకు పలు వాహనాల్లో వస్తుంటారు. ఉత్తరాదిన గుర్రాలపై వస్తే దక్షిణాదిన స్తోమతను బట్టి పలు వాహనాలను ఉపయోగిస్తుంటారు. విదేశాల్లో ఈ ట్రెండ్ విభిన్నంగా ఉంటోంది.
తాజాగా ఇందుకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఘనా దేశంలో ఓ పెళ్లి కుమార్తె శవపేటికలో మండపానికి వచ్చి అందరినీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఈ శవ పేటికను కొంతమంది పెళ్లి వేడుక జరిగే ప్రదేశానికి మోసుకొచ్చారు. దానిపై పరచిన నల్లని వస్త్రాన్ని తొలగించి మూతను తెరిచారు. వేడుకలో పాలుపంచుకోవడానికి వచ్చిన బంధువులు, స్నేహితులు చప్పట్లు కొడుతున్న సమయంలో శవ పేటిక నుంచి పెళ్లి కుమార్తె లేచి.. వయ్యారంగా నడుస్తూ వరుడి వద్దకు చేరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.