(Local) Thu, 24 Sep, 2020

బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్యాక్

November 01, 2019,   4:18 PM IST
Share on:
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్ తో ముందుకు వచ్చింది. బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఆఫర్ టెలికం చరిత్రలో ఇప్పటివరకు ఏ నెట్ వర్క్ కూడా తీసుకురాలేదు. తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు దగ్గరయ్యేందుకు మంచి ప్రయత్నంతో ముందుకు వస్తోంది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ఆఫర్లలో దూసుకుపోతుండగా వారి కంటే మెరుగైన ఆఫర్ ను తీసుకువచ్చింది. అతిపెద్ద నెట్ వర్క్ అయినా జియో ఈ మధ్యకాలంలో నిమిషానికి రూ.6పైసలు చొప్పున వసూలు చేస్తూ అంతే మొత్తంలో డేటాను ఇస్తుండగా.. జియోకు చెక్ పెట్టేలా అదిరిపోయే ప్లాన్ ను తెచ్చి కస్టమర్లను ఔరా అనిపించేలా చేస్తోంది.

బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు ఫోన్ చేస్తే కస్టమర్ కే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను చేసింది. 5 నిమిషాలు ఇతర నెట్ వర్క్ లకు చేసి మాట్లాడితే రూ.6పైసలు నేరుగా మొబైల్ నెంబర్ కు యాడ్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ అధికారి వివేక్ బెన్జల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు మరింత చేరువై వారికి నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక ముందు నుంచి ఇంతకంటే మంచి ఆఫర్లు తీసుకువస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.