(Local) Wed, 16 Oct, 2019

ల్యాప్ ట్యాప్ కొంటే రూ. 50 వేల వరకు క్యాష్ బ్యాక్

October 02, 2019,   8:37 PM IST
Share on:
ల్యాప్ ట్యాప్ కొంటే రూ. 50 వేల వరకు క్యాష్ బ్యాక్

పండగల వేళ కంపెనీలన్ని భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ల్యాప్ ట్యాప్ కంపెనీలు కూడా సేల్స్ పెంచుకోవడానికి పలు ఆఫర్లనిస్తున్నాయి. ల్యాప్ ట్యాప్ కంపెనీలు పెట్టిన ఆఫర్లతో ల్యాప్ ట్యాప్ కొనుగోలు చేసినవారు రూ. 50 వేల వరకు ఇన్ స్టాంట్ క్యాష్ బ్యాక్ కూడా దక్కించుకోవచ్చు. 20 శాతం క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్‌ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. అష్యూర్డ్‌ గిఫ్ట్స్, రివార్డులు, బోనస్‌ పాయింట్లు అదనంగా లభించనున్నాయి. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివిధ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.