(Local) Thu, 18 Jul, 2019

వాట్సాప్ తో మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది

July 01, 2019,   2:28 PM IST
Share on:

 వాట్సాప్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్లు వాడడం వలన సామాజిక సంబంధాలు చాలా దెబ్బతింటున్నాయని గతంలో అనేక అధ్యయనాలు వెల్లడించడం జరిగింది.అయితే వీటికి భిన్నంగ తాజాగా హ్యూమన్ కంప్యూటర్ స్టడీస్ అనే జర్నల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం  వాట్సాప్  వినియోగం వల్ల అధిక శాతం మందిలో మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా సామాజిక సంబంధాలు సక్రమంగా రాక ఒంటరిగా భావించేవారు వివిధ వాట్సప్ గ్రూపులలో సభ్యులుగా ఉండటం ద్వారా,  అలాగే వాట్సప్ ద్వారా తమ స్నేహితులతో చాటింగ్ చేయడం ద్వారా తమ ఒంటరితనాన్ని పోగొట్టుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

 వాట్సాప్ వాడుతున్న 200 మంది వినియోగదారుల మీదఈ స్టడీ నిర్వహించబడింది. ఆన్లైన్ క్వశ్చనీర్ రూపంలో  నిర్వహించబడిన ఈ స్టడీలో వాట్సాప్ వినియోగం వలన వ్యక్తుల మధ్య ఆ సంబంధం మెరుగుపడుతోందని, చాలా మంది ఒక గ్రూపులో తాము సభ్యులుగా భావిస్తున్నారని,  తద్వారా ఒంటరితనాన్ని పోగొట్టుకున్నారని వచ్చిన ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ స్టడీ లో 150 మంది మహిళలు, 42 మంది పురుషులు పాల్గొనడం జరిగింది. రోజు మొత్తం మీద ఎన్ని నిమిషాల పాటు వాట్సప్ మీద గడుపుతున్నాం అన్న దాన్ని  ఆధారంగా చేసుకొని, సంబంధ బాంధవ్యాలు నాణ్యత ఆధారపడి ఉంటోందని ఈ నివేదిక వెల్లడించింది.

ఇప్పటివరకు  వాట్సాప్ లాంటి అప్లికేషన్లు వాడటం వలన చాలా నష్టపోతున్నామని భావించే వారికి కొంత వరకు ఊరట కలిగించే నివేదిక ఇది.  అయితే ఇవన్నీ కేవలం అతి తక్కువ మంది వినియోగదారుల మీద తీయబడిన శాంపిల్స్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి వారి మానసిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.