(Local) Mon, 16 Sep, 2019

ఈ యాప్ తో సినిమాలలో హీరో కావడం ఎంతో ఈజీ ...

September 04, 2019,   4:44 PM IST
Views: 52
Share on:
ఈ యాప్ తో సినిమాలలో హీరో కావడం ఎంతో ఈజీ ...

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు,వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య అందరూ సరదా కోసం  టిక్ టాక్,ఫేస్ యాప్ లాంటి ఎన్నో యాప్ లను ట్రై చేస్తుంటారు. తాజాగా వీటికి మించిన యాప్ ఒకటి హల్ చల్ చేస్తోంది. కేవలం ముఖాలను మార్చడమే  కాకుండా ఏకంగా మిమ్మల్ని హీరోలను చేసేస్తుందీ యాప్. సినిమాల్లో నటించాలనే కోరిక ఉండి, అవకాశాల్లేని వారికి ఇది ఆ లోటును తీర్చేస్తోంది. టైటానిక్, అవతార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లోని హీరోల్లా మిమ్మల్ని మార్చేస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పులు వైరల్ అవుతున్నాయి. చైనాకు చెందిన కంపెనీ ఒకటి  ఝవో పేరుతో ఈ యాప్‌ను విడుదల చేసింది.

మనం చేయాల్సిందిల్లా యాప్ లోకి దూరి మన ఫోటోను అప్‌లోడ్‌ చేయడమే. తర్వాత మనకు నచ్చిన సినిమాను ఎంచుకుని, అందులోని నచ్చిన సీన్ పై, ఎంచుకున్న పాత్రపై క్లిక్ చేయాలి. అంతే, సదురు నటుడి ముఖం స్థానంలో మన ముఖం చేరుతుంది. ఆ హోరో చేసే పనులను మనం చేస్తున్నట్టే ఉంటుంది.  ఐవోఎస్‌ స్టోర్ నుండి ఈ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత వర్గం
భారత సైనికులను రెచ్చగొట్టేలా వ్యవహరించిన చైనా
భారత సైనికులను రెచ్చగొట్టేలా వ్యవహరించిన చైనా
అక్టోబర్ లో భారత్ తో యుద్ధం - పాక్ మంత్రి సంచలన వ్ ...
అక్టోబర్ లో భారత్ తో యుద్ధం - పాక్ మంత్రి సంచలన వ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.