(Local) Wed, 16 Oct, 2019

రూ.990కే క్లా జి9 గేమింగ్ ఇయర్‌ఫోన్స్

September 24, 2019,   3:30 PM IST
Share on:
రూ.990కే క్లా జి9 గేమింగ్ ఇయర్‌ఫోన్స్

ఎలక్ట్రానిక్స్ తయారీదారు క్లా.. జి9 పేరిట నూతన గేమింగ్ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. గేమర్ల కోసమే ప్రత్యేకంగా వీటిని రూపొందించామని ఆ కంపెనీ చెబుతున్నది. కాగా ఈ ఇయర్‌ఫోన్స్‌లో 10ఎంఎం డ్రైవర్స్‌ను ఏర్పాటు చేసినందున వీటి నుంచి వెలువడే సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌కు డిటాచబుల్ బూమ్ మైక్‌ను ఇస్తున్నారు. ఇది 360 డిగ్రీల కోణంలో రొటేట్ అవుతుంది. దీంతో వినియోగదారులు ఎలాగైనా ఈ మైక్‌ను రొటేట్ చేసి దాంతో మాట్లాడుకోవచ్చు. ఈ ఇయర్‌ఫోన్స్‌పై ఓ మల్టీ ఫంక్షన్ బటన్‌ను ఇచ్చారు. దానిపై కాల్స్ కోసం ఆన్సర్/రిజెక్ట్ బటన్లతోపాటు, మ్యూజిక్ కోసం ప్లే/పాజ్, ప్రీవియస్/నెక్ట్స్ ట్రాక్ బటన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఇయర్‌ఫోన్స్ బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు రూ.990 ధరకు అమెజాన్‌లో లభిస్తున్నాయి. వీటి అసలు ధర రూ.1490 కాగా ఆఫర్ కింద రూ.990కే అందిస్తున్నారు. ఈ ఇయర్‌ఫోన్స్‌పై 1 సంవత్సరం వారంటీని అందిస్తున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.