(Local) Mon, 17 Jun, 2019

విలక్షణ చిత్రకారుడు రామకృష్ణ

April 22, 2019,   10:24 PM IST
Share on:

బొమ్మలు గీయడం ఒక కళ. మనిషిలోని అంతరంగాలు, భావాలు, భావోద్వేగాలు చిత్రాల్లో ప్రస్ఫుటించేలా పెయింటింగ్స్ వేయడమంటే కళాత్మకత ఉండాలి. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి ఇతివృత్తంగా కుంచెతో రంగులద్దుతున్నాడు ఆర్టిస్ట్ రామకృష్ణ. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ , రోడ్ నంబర్ 36 ,బియాండ్ కాఫీలో జరుగుతున్న ఆర్ట్ గ్యాలరీలోకి అడుగుపెట్టగానే ఎగ్జిబిషన్ లోని పెయింటింగ్స్ కట్టిపడేస్తాయి. ఒక అమ్మాయి.. అబ్బాయి మనసులోని అంతరంగాలు, భావాలు, ఆనందాలు,ఇతిహాసాలు మన కళ్ళ ముందు జరిగినట్టు కనిపించేలాగా బొమ్మల్లో ప్రతిబింబించాడు ఆర్టిస్ట్ రామకృష్ణ. తెలుగు డైలీ 24 ఈ ఆర్ట్స్ గ్యాలరీ కి వెళ్లి రామకృష్ణ ని పలకరించినప్పుడు ఆయన తన అంతరంగాలను పంచుకుంటూ ఇలా అన్నారు " నేను బొమ్మలు వెయ్యడం మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్నాను .నా గురువు మా నాన్నగారే.నేను కాలేజీ లో చదివేటప్పుడు రాజమండ్రి జూనియర్ స్టూడెంట్స్ ఆర్ట్స్ ఛాంబర్ అవార్డు గెల్చుకున్నాను.నా బ్రష్ పేరు మిల్కీ (Milky) అని పేరు పెట్టుకుని దాని ద్వారా కార్టూన్స్ వెయ్యడం చేసేవాడిని ,అలా వేసిన నా కార్టూన్స్ A.P.Times లో పబ్లిష్ అయ్యాయి అని తన అంతరంగాని ఆవిష్కరించారు రామకృష్ణ .

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.