(Local) Thu, 13 Aug, 2020

ఇక పై పేస్బుక్ లో లైక్స్ కనిపించవు ...

September 04, 2019,   4:33 PM IST
Share on:
ఇక పై పేస్బుక్ లో లైక్స్ కనిపించవు  ...

ఫేస్‌బుక్ లో ఏ పోస్ట్ పెట్టిన సహజంగా ఎవరైనా సరే లైక్స్ కోసం చూడడం సహజం అయ్యిపోయింది. ఎంత ఎక్కువ లైక్స్ వస్తే వారు అంత గొప్ప పోస్ట్ పెట్టామని ,గాలిబుడగలా ఉబ్బిపోవడం, తక్కువొస్తే నీరుగారిపోవడం రివాజుగా మారింది. తక్కువ లైక్స్ వచ్చే నెటిజన్లు మానసిక ఆందోళనకు కూడా గురువుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ యాజమాన్యం ఓ సంచలన ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

పోస్ట్‌కు వచ్చిన లైక్స్‌ను దాచేయడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని దేశాల్లో ఇన్ స్టాగ్రామ్‌లో అమలు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లోనూ త్వరలోనే అమల్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఫేస్‌బుక్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పోస్ట్ చేసిన వ్యక్తికి మాత్రమే లైక్స్ వివరాలు కనిపిస్తాయి. అది కూడా సంఖ్య కాకుండా ఎవరు లైక్ చేశారో మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు లైక్స్ నంబర్ అసలు కనిపించదు. దీని వల్ల యాక్టివ్‌గా ఉండని వారు కూడా లైక్స్ తో సంబంధం లేకుండా పోస్ట్ పెట్టడం వంటి కొన్ని సానుకూల ఫలితాలు ఉన్నా, ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉంటాయంటున్నారు. లైక్స్ కనిపించకపోతే పోస్ట్ లు తక్కువ పెడతారని, దీంతో ఫేస్ బుక్ ఆదాయం పడిపోతుందని  మీడియా వర్గాలు అంటున్నాయి. 

సంబంధిత వర్గం
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.