(Local) Wed, 16 Oct, 2019

త్వరలో ఫేస్‌బుక్ న్యూస్ ఫీచర్ ..

August 12, 2019,   1:29 PM IST
Share on:
త్వరలో ఫేస్‌బుక్  న్యూస్ ఫీచర్ ..

సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందించేందుకు సిద్దమైనది. ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్‌బుక్‌లోని ప్రధాన ఫీచర్లు న్యూస్‌ఫీడ్‌, మెస్సెంజర్‌, వాచ్‌తో పాటు న్యూస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ని జోడించనున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలకు 3మిలియన్ డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. అంతా సజావుగా సాగితే.. వచ్చే సంవత్సరం తొలుత ఈ ఫీచర్‌ని అమెరికా యూజర్లకు అందించనున్నట్లు సమాచారం. సమాచారం కోసం ఆయా వార్తాసంస్థలకు ఫేస్‌బుక్‌ భారీగా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మాత్రం ఉచితంగానే అందించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.