(Local) Fri, 22 Nov, 2019

ఫేస్‌బుక్ కొత్త లోగో వచ్చేసింది ...

November 05, 2019,   3:32 PM IST
Share on:
ఫేస్‌బుక్ కొత్త లోగో వచ్చేసింది ...

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, కొత్త లోగోను ఆవిష్కరించింది. వాట్స్‌ప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా అప్లికేషన్‌లకు మాతృసంస్థగా ఉన్న ఫేస్‌బుక్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త లోగోను విడుదల చేసింది. ఫేస్‌బుక్‌కు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా యాప్‌ల నుంచి ఫేస్‌బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని, యూజర్లకు కూడా సోషల్ మీడియాలో గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త లోగోను ప్రవేశపెట్టినట్టు ఫేస్‌బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో తెలిపారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ అధీనంలో ఫేస్‌బుక్ యాప్, మెసింజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్స్‌ప్, వర్క్ ప్లేస్, ఓకులస్, పోర్టల్, కాలిబ్రా వంటి అనుబంధ యాప్స్ ఉన్నాయి. అలాగే ఫేస్‌బుక్ కొత్త వెబ్‌సైట్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.