(Local) Wed, 16 Oct, 2019

శాంసంగ్ నుండి ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌

September 25, 2019,   4:25 PM IST
Share on:
శాంసంగ్ నుండి ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌

 ఉత్తర కొరియాకు చెందిన శాంసంగ్ ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌ను తయారు చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగానూ దీనిని వినియోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. ఫోల్డ్ తెరిచినప్పుడు 7.3 ఇంచెస్ స్క్రీన్ ట్యాబ్లెట్‌ పీసీ మాదిరిగా, ఫోల్డ్ మూసినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్‌తో స్మార్ట్‌ఫోన్‌ వలె ఉపయోగించొచ్చు. ఈ ఫోల్డ్ ఫోన్‌ను దక్షిణ కొరియాలో ఇటీవలే విడుదల చేశారు. అమెరికాలో ఈ నెల 27న ఆవిష్కరించనున్నారు. భారత మార్కెట్‌లో అక్టోబర్ 1న విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. స్పేస్‌ సిల్వర్, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

సంబంధిత వర్గం
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!
ఉగ్రమూలాలపై దెబ్బకొడితే ఉగ్రవాదాన్ని జయించినట్లే!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.