(Local) Sat, 24 Aug, 2019

ఫోన్ పోగొట్టుకున్న వారికి శుభవార్త

June 23, 2019,   3:37 PM IST
Share on:

ఇటీవలి కాలంలో ఫోన్ పోగొట్టుకున్న సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫోన్ పోయినప్పుడు పోలీస్ కంప్లైంట్ చేసినా కూడా పెద్దగా ఫలితం ఉండటం లేదు.ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనతో రాబోతోంది. అది కనుక అందుబాటులోకి వస్తే కచ్చితంగా ఫోన్ పోగొట్టుకున్నవారు కొంత వరకు ఉపశమనం పొందొచ్చు.దేశంలో ఉన్న అన్ని మొబైల్ ఫోన్లకు సంబంధించిన IMEI నెంబర్ల  డేటాబేస్‌ని టెలికాంశాఖ నిర్వహించబోతోంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పేరిట పిలవబడే ఈ డేటాబేస్ ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని ఫోన్లకు సంబంధించిన IMEI నెంబర్లను కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్ Dual SIM  కోవకు చెందినది అయినట్లయితే దానికి సంబంధించిన రెండు IMEI నెంబర్లు కూడా స్టోర్ చేయబడతాయి.

ఫోన్ పోగొట్టుకున్నవారు పోలీస్ కేసు ఫైల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కాపీతో  డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి,  ఆ విషయం తెలియజేసినట్లయితే ఆ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ బ్లాక్‌లిస్టులో పెట్టబడుతుంది. ఈ ఐడెంటిటీ రిజిస్టర్లో మూడు రకాల సమాచారం ఉంటుంది.  వైట్ లిస్ట్, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్. వైట్ లిస్టులో ఉన్న మొబైల్ ఫోన్లు నిక్షేపంగా వాడుకోవచ్చు. వాటిలో కొత్త సిమ్ కార్డు కూడా పనిచేస్తుంది.బ్లాక్ లిస్టులో ఉన్న ఫోన్లకి  సిమ్ కార్డు పనిచేయదు. ఎవరూ వాటిని వాడుకోలేరు.  లేకపోతే ప్రమాణాలను అనుసరించి లేని ఫోన్లు గ్రేలిస్టులో  పొందుపరచబడతాయి. ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఆ ఫోన్లు పనిచేస్తుంటాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.