(Local) Mon, 17 Jun, 2019

పాత ఫీచరే కానీ కొంచెం సరి కొత్తగా - గూగుల్‌ డుయో యాప్

May 25, 2019,   12:11 PM IST
Share on:

గూగుల్‌ సంస్థకు చెందిన ప్రముఖ వీడియోకాల్‌ యాప్‌ డుయో కొత్త ఫీచర్‌ను ఆడ్‌ చేసింది. ఇప్పటి వరకు ఆ వీడియోకాల్‌లో ఏకకాలంలో ముగ్గురు లేదా నలుగురితో గ్రూప్‌ వీడియో చాట్‌ చేసుకునే వెసులుబాటు ఉండగా, దీన్ని మరింత పెంచింది. ఇక నుంచి ఏకకాలంలో 8 మంది గ్రూప్‌ వీడియో చాట్‌ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకే అధికారిక బ్లాగ్‌లో గూగుల్‌ డుయో ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీడియో కాల్స్‌ చేసేటప్పుడు డేటాను ఆదా చేయడం కోసం డేటా సేవింగ్‌ మోడ్‌ను ప్రవేశపెట్టింది. వీడియోకాల్‌లో ఉన్నప్పుడు టెక్స్ట్‌, ఇమోజీ లేదా డూడుల్‌ను పంపించే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌లో కేవలం ముగ్గురితో మాత్రమే ఏకకాలంలో వీడియో చాట్‌ చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.