(Local) Thu, 02 Jul, 2020

జులైలో హుందాయ్ తొలి ఎలక్ట్రిక్ వాహనం

May 30, 2019,   1:03 PM IST
Share on:
జులైలో హుందాయ్ తొలి ఎలక్ట్రిక్ వాహనం

కార్ల తయారీ సంస్థ హుందాయ్ తొలి ఎలక్ట్రిక్ వాహనం ‘కోనా’ ఎస్‌యువిని ఈ ఏడాది జులైలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. భారత్ మార్కెట్లోకి హుందాయ్ కొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోందని, కోనా ఎస్‌యువి ఎలక్ట్రిక్ వాహనాన్ని జులైలో విడుదల చేస్తామని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. దీని తర్వాత ‘గ్రాండ్ ఐ10’ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.