(Local) Wed, 23 Oct, 2019

అద్భుతమైన ఆఫర్‌ తో ఆకటుకోనున్న ఐడియా

May 03, 2019,   10:30 PM IST
Share on:
అద్భుతమైన ఆఫర్‌ తో ఆకటుకోనున్న ఐడియా

ఐడియా మరో అద్భుతమైన ఆఫర్‌ తో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. సిటీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఐడియా ఏడాది పాటు రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ ఆఫర్ పొందేందుకు ఐడియా ఖాతాదారులు తొలుత సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెల రోజుల్లో రూ.4 వేలు ఖర్చు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కాలపరిమితి 365 రోజులు. ఈ ఆఫర్ ఐడియా ప్రీపెయిడ్ ఖాతాదారులకు మాత్రమే. వొడాఫోన్ సబ్‌స్క్రైబర్స్‌కు వర్తించదు.ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు తొలుత ఐడియా వెబ్‌సైట్ నుంచి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డు చేతికి అందిన తర్వాత నెల రోజుల్లోపు రూ.4 వేలు ఖర్చు చేయాలి. అంత మొత్తం ఖర్చయిన వెంటనే ఈ ఆఫర్‌కు యూజర్లు అర్హులవుతారు. జూలై 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఐడియా తెలిపింది. ఖాతాదారుల వయసు కనీసం 23 ఏళు ఉండి, అహ్మదాబాద్, బరోడా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పుణె, సికింద్రాబాద్‌లలో నివసిస్తున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఐడియా తెలిపింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.