(Local) Mon, 21 Oct, 2019

ఫోన్ పోయిందా అయితే నో ఫ్రాబ్లం

September 14, 2019,   4:54 PM IST
Share on:
ఫోన్ పోయిందా అయితే నో ఫ్రాబ్లం

ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! మొబైల్‌ ఫోన్‌ను కాల్స్‌ మాట్లాడటానికేకాకుండా వివిధ రకాల యాప్‌ల ద్వారా అనేక ఆర్థిక లావాదేవీలు, ఇతర పనులను నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్‌ను ఎవరైనా దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా దాన్ని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. పొగొట్టుకున్న ఫోన్‌ మళ్లీ దొరకడం అసాధ్యంగా మారుతోంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఫోన్లు కోల్పోయిన వారు తమ ఫోన్‌ను గుర్తించడానికి లేదా ఫోన్‌ పని చేయకుండా బ్లాక్‌ చేయడానికి వీలు కల్పించే సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌)ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని శుక్రవారంనాడు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ప్రారంభించారు. దీని ద్వారా కోల్పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్‌ ఫోన్‌ను ఐఎంఈఐ నెంబర్‌ ఆధారంగా బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో ఈ సర్వీసులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. 2017 నుంచి ఇందుకు సంబంధించిన టెక్నాలజీపై టెలీకమ్యూనికేషన్స్‌ శాఖ పని చేస్తోంది. ప్రతి మొబైల్‌ ఫోన్‌కూ 15 అంకెల ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నెంబర్‌ ఉంటుంది. దీని ఆధారంగా మొబైల్‌ ఫోన్‌ను ట్రాక్‌ చేసే అవకాశం లభిస్తుంది. కాగా మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నట్టయితే మొదట పోలీసుల వద్ద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ తర్వాత 14422 నెంబరుకు ఫోన్‌ చేసి టెలికాం విభాగానికి సమాచారం అందించాలి. అనంతరం మొబైల్‌కు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారు. దీని వల్ల ఆ ఫోన్‌ ఏ నెట్‌వర్క్‌తో కూడా పని చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఫోన్‌ నిరుపయోగం అవుతుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.