(Local) Mon, 17 Jun, 2019

డేటా-సేవింగ్ మోడ్ ఫీచర్స్ తో ఇంస్టాగ్రామ్ యాప్

June 05, 2019,   6:25 PM IST
Share on:

తక్కువ నాణ్యత గల మొబైల్ నెట్వర్క్ గల ప్రాంతాల్లో ప్రముఖ సోషల్ నెట్వర్క్ యాప్ నిరంతరాయంగా పని చెయ్యడానికి ఫోటో-మెసేజింగ్ యాప్ ఇంస్టాగ్రామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు డేటా-సేవర్ ఫీచర్ ని ప్రకటించింది.ఈ ఫీచర్ వల్ల యాప్ లో  వీడియోలు ముందే లోడ్ చేయడాన్నిఇది  నిరోధిస్తుంది.  అలాగే వినియోగదారుడు  ఎంచుకుంటే తప్ప అధిక-రిజల్యూషన్ ఫోటోలను డౌన్లోడ్ చేయలేరు. దీని వలన ఇంస్టాగ్రామ్ యాప్  డేటా వినియోగాన్ని నియంత్రించడానికి , ఫోటోలను లోడ్ చేయడానికి వేగాని పెంచుతుంది.

ఈ డేటా-సేవర్ ఫీచర్తో నెమ్మదిగా ఉన్న నెట్వర్క్ ప్రాంతాలలో కూడా నిరంతరాయంగా ఇంస్టాగ్రామ్ పని చేయడానికి    దోహదపడుతుందని అని ఫేస్బుక్ ఇండియా పార్టనర్ షిప్ హెడ్ , డైరెక్టర్ మనీష్ చోప్రా ఒక ప్రకటనలో తెలిపారు. "అకౌంట్" మరియు "సెల్యులార్ డేటా ఉపయోగం" ఆప్షన్ కింద యాప్ సెట్టింగులలో భాగంగా ఈ ఫీచర్ జతచేయబడింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.