
ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన మూడు వీడియో యాప్స్‌లో 'టిక్‌టాక్' ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వినియోగదారుల్లో 30 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే. వారికింకా సొంత వ్యక్తిత్వం అబ్బనితరం. అంటే పలు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉన్న ప్రాయం వారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలనే అత్యంత ప్రమాదరకరమైన వైరస్ టిక్‌టాక్‌కు సోకింది. అదే 'ISIS (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా)' ISIS టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తున్న, గొంతులు కోసి చంపేస్తున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్ చేస్తున్నారు. గత మూడు వారాల నుంచే ఈ వైరస్ ప్రారంభమైంది. వీటిని చూసి ఉలిక్కిపడిన ' టిక్‌టాక్' కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తోంది. గత వారం ISIS టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్ నుంచి యాజమాన్యం తొలగించే లోగానే అవి డజన్ ఖాతాలకు షేర్ అయ్యాయి. ఐసిస్ వీడియో క్లిప్పింగ్స్‌లో ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మొకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ రక్తనాళాలను చాకుతో తెగ నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే దృశ్యాలే ఎక్కువగా ఉన్నాయి. 175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్ అయిన విషయాన్ని యాప్ యాజమాన్యం గుర్తించింది. వారిలో ఒక యూజర్ మహిళ కావడం గమనార్హం. వారి పోస్టింగ్‌లకు 25 నుంచి 125 వరకు లైక్స్ కూడా రావడం ఆందోళనకరమైన విషయం. మూడు వారాల క్రితం ఈ వీడియో క్లిప్పింగ్‌ల పోస్టింగ్‌లు మొదలు కాగా, తాజాగా ఒకటి రెండు రోజుల క్రితం పోస్ట్ అయింది. వాటిల్లో టెర్రరిస్టులు తుపాకులు గాల్లోకి ఎత్తి పాటలు పాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.ISIS టెర్రరిస్టులు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాలోని ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అల్ఫాబెట్‌లను ఉపయోగించుకోగా, పాటలు, డ్యాన్సుల షేరింగ్లతో ఎక్కువ పాపులర్ అయిన 'టిక్‌టాక్'లోకి ప్రవేశించారు. టెర్రరిస్టు సంస్థలను నిషేధించినట్లు టిక్‌టాక్ యాజమాన్యం తన కంపెనీ మార్గదర్శకాల్లోనే పేర్కొంది. టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపునిచ్చింది. బీజింగ్‌లోని 'BYTEDANCE' కంపెనీ టిక్‌టాక్‌ను నిర్వహిస్తోంది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.