(Local) Sat, 24 Aug, 2019

జియో షాక్ : 600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్స్

June 27, 2019,   12:10 PM IST
Share on:

దేశ వ్యాప్తంగా టెలికాం రంగంలో  సంచలనం సృష్టించిన జియో .. ఇప్పుడు కేవలం రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్సులను అందించడం ద్వారా మిగిలిన టెలికాం రంగ సంస్థలకు ఝలక్ ఇచ్చింది .గత 2018వ సంవత్సరం నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. జియో గిగా ఫైబర్ ఆఫర్‌ను పొందాలంటే ముందుగా రూ.4,500లను డిపాజిట్‌గా చెల్లించాలి. ఆపై చెల్లించే నెలసరి చెల్లింపుకు తగినట్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. అయితే ప్రస్తుతం జియో సంస్థ రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్స్ సేవలను అందించనుంది.

అంతేగాకుండా రూ.1,000లను అదనంగా చెల్లిస్తే.. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ అనే 40 గ్యాడ్జెట్లను పొందవచ్చు. జియో నుంచి లభించే ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ ఇతర టెలికాం సంస్థలకు మాత్రం జియో ఆఫర్ కాస్త గుదిబండలా మారింది. దీంతో ఎయిర్టెల్,వొడాఫోన్ వంటి సంస్థలకు షాక్ తగిలింది. ఫలితంగా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు మల్లాగుల్లాలు పడుతున్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.