(Local) Sat, 24 Aug, 2019

భారత్‌vsఆస్ట్రేలియా : మ్యాచ్‌లో సూపర్ స్టార్ మహేశ్‌ సందడి

June 10, 2019,   11:57 AM IST
Share on:

ఓవల్‌ వేదికగా జరుగుతున్న టీమిండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు.
ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మహేశ్‌ కుటుంబంతోపాటు క్రికెట్‌ మైదానానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మహేశ్‌, నమ్రత, గౌతమ్‌లతో కలిసి దిగిన సెల్ఫీని వంశీ ట్విటర్‌లో షేర్‌ చేశారు.‘ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా..’ అంటూ ‘సెలబ్రేటింగ్‌ మహర్షి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని మహేశ్‌ ఇప్పటికే చెప్పారు. పలు మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించినప్పుడు సోషల్‌మీడియా వేదికగా జట్టుకు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.