(Local) Wed, 18 Sep, 2019

లీక్ అయిన OnePlus 7 ధరలు

May 08, 2019,   10:50 AM IST
Views: 105
Share on:
లీక్ అయిన OnePlus 7 ధరలు

OnePlus  సంస్థ తాజాగా మార్కెట్లోకి OnePlus 7 Pro ఫోన్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.ఈ ఫోన్ కి సంబంధించిన ధరలు తాజాగా లీక్ అయ్యాయి.  ఇందులో బేస్ మోడల్ అయిన OnePlus 7 Pro 6GB RAM, 128 GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ 38,990 రూపాయలకు ధరను ఫిక్స్ చేసినట్టు సమాచారం. 

ఇకపోతే OnePlus 7 Proలో 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర 45,990 రూపాయల ఉండబోతోంది.  దీంతోపాటు 10 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన హై ఎండ్ మోడల్ రాబోతోంది. దీని ధర అన్నిటికంటే ఎక్కువగా 51,990 రూపాయలు  నిర్ణయించబడింది. OnePlus 7, OnePlus 7 Pro ఫోన్లు రెండూ మే 14వ తేదీన భారతీయ మార్కెట్లో విడుదల చేయబడుతున్నాయి.

క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్  ఆధారంగా పనిచేసే ఈ ఫోన్లో, వ్రాప్ ఛార్జ్ (Wrap Charge) 30 అనే  ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ పొందుపరచబడి ఉంటుంది. 4000 mAh  కెపాసిటీ కలిగిన బ్యాటరీ తో పాటు, ఫోన్ వెనుక భాగంలో 48 మరియు 16 మరియు 8 మెగా పిక్సెల్  రిజల్యూషన్  కలిగిన మూడు కెమెరాల, ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సెల్  సెల్ఫీ కెమెరా లభిస్తాయి. 6.64 అంగుళాల 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్  కలిగిన డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా OnePlus 7 ఫోన్ పనిచేస్తుంది.

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.