(Local) Sat, 24 Aug, 2019

ఇక పై షాపింగ్ మాల్స్ లో పెట్రోల్, డీజిల్

June 19, 2019,   2:05 PM IST
Share on:

ఇక పై షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, సూపర్ మార్కెట్లలోనూ పెట్రోల్, డీజిల్ విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియ, సహజ వాయువు మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రతిపాదించనుందని తెలిసింది. చిల్లర ఇంధన రంగంలో ప్రవేశించే ప్రయివేటు కంపెనీలకు అవసరమైన కనీస వసతుల ఆంక్షల్ని కూడా సడలించనున్నారు. కనీస మౌలిక వసతుల కోసం దేశవాళీ మార్కెట్లో కనీసం రూ.రెండు వేల కోట్లు పెట్టుడులు, 30 లక్షల టన్నుల క్రూడాయిల్‌కు బ్యాంకు గ్యారెంటీలు తదితర నిబంధనలు సడలించనున్నారు. దీంతో ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్తో పాటు అంతర్జాతీయ కంపెనీ సౌదీ అరామ్‌కో తదితర బహుళజాతి కంపెనీలు భారత రిటైల్ ఇంధన రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.