(Local) Mon, 16 Sep, 2019

త్వరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్

September 11, 2019,   12:32 PM IST
Views: 16
Share on:
త్వరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్

ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు 5జీ వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న 4జీ ట్రెండ్ కూడా ముగింపుకు వస్తుండటం, 5జీ 2020, 2021 నాటికి మార్కెట్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుండటంతో ఆ టెక్నాలజీకి తగ్గ స్మార్ట్ ఫోన్లను అన్ని కంపెనీలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే శాంసంగ్, హువావే, షావోమి, ఒప్పో వంటి ఫోన్లు వంటి తమ సంస్థల నుంచి 5జీ ఫోన్లను ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ కూడా చేరింది. ఈ సంస్థ నుంచి 5జీని సపోర్ట్ చేసే ఫోన్లు ఈ ఏడాదే రాబోతున్నాయి.

ఈ విషయాన్ని ఆ సంస్థ మాధవ్ సేథ్ ట్వీటర్లో తెలిపారు. ఐఎఫ్ఏ 2019 సదస్సులో క్వాల్ కామ్ సంస్థ 5జీని సపోర్ట్ చేసే స్నాప్ డ్రాగన్ 7, 6 సిరీస్ లను ప్రకటించింది. అంతేకాకుండా వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు 5జీ ఫోన్లు తీసుకువచ్చే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు క్వాల్ కామ్ ఈ సదస్సులో తెలిపింది. ఇక రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 7 సిరీస్ చిప్ సెట్ ఉండనుంది. అంతేకాకుండా ఈ చిప్ సెట్ లో 5జీ నూతన రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ ఉంది. ఇందులో ఒక మోడెం, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ రిసీవర్, రేడియో ఫ్రీక్వెన్సీ ఫ్రంట్ ఎండ్ ఉంటాయి. రియల్ మీ నుంచి ఇకపై రాబోయే స్మార్ట్ ఫోన్లలో అన్ని ఫ్రీక్వెన్సీలను సపోర్ట్ చేయడానికి ఇదే వ్యవస్థను ఉపయోగించనున్నారు.

సంబంధిత వర్గం
సరి కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది..
సరి కొత్త ఫీచర్స్ తో ఆండ్రాయిడ్ 10 వచ్చేసింది..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.