(Local) Mon, 21 Oct, 2019

రియల్ మీ రియల్ దసరా ధమాకా..

September 16, 2019,   12:36 PM IST
Share on:
రియల్ మీ రియల్ దసరా ధమాకా..

ఫోన్ వినియోగదారులకు దసరా పండుగ ఆఫర్ గా రియల్ మీ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.  రియల్ మీ సంస్థ లాంచ్ ఈవెంట్లో రియల్ మీ ఎక్స్ టీ మొబైల్ ను లాంచ్ చేయడమే కాకుండా, మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేసింది. తమ ఫోన్లకు ఆండ్రాయిడ్ అప్ డేట్లు ఎప్పుడు వస్తాయో తెలిపింది. భారతదేశంలో రూ.20 వేల లోపు ధరలో క్వాడ్ కామ్(వెనకవైపు నాలుగు కెమెరాలు) ఫీచర్ ఉన్న మూడు ఫోన్లూ(రియల్ మీ 5, రియల్ మీ 5 ప్రో, రియల్ మీ ఎక్స్ టీ) తమవేనని పేర్కొంది. పవర్ బ్యాంక్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ లను ఈ ఈవెంట్లో రియల్ మీ లాంచ్ చేసింది.

రియల్ మీ పవర్ బ్యాంక్..
రియల్ పవర్ బ్యాంక్ సామర్థ్యం 10,000 mAhగా ఉండనుంది. 18W టూవే క్విక్ చార్జ్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. యూఎస్ బీ-ఏ, యూఎస్ బీ-సీ రెండు రకాల అవుట్ పుట్ లను ఇది సపోర్ట్ చేస్తుంది. దీంతో మొబైల్, ల్యాప్ టాప్ లకు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకేసారి రెండు డివైజ్ లకు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. దీని ధరను రూ.1,299గా నిర్ణయించారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్, రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో ఇది అందుబాటులో ఉండనుంది. అదే సమయంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ఉన్నాయి కాబట్టి, వీటిపై ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక తగ్గింపు లభించే అవకాశం ఉంది.

రియల్ మీ బ్లూటూత్ ఇయర్ బడ్స్..
రియల్ మీ సంస్థ తమ బ్లూటూత్ ఇయర్ బడ్స్ కు రియల్ మీ బడ్స్ వైర్ లెస్ గా నామకరణం చేసింది. బ్లూటూత్ 5.0 సాంకేతికతతో ఇవి పనిచేస్తాయి. ఇందులో మూడు బటన్లు ఉంటాయి. ఐపీఎక్స్4 స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఒక్కసారి దీన్ని పూర్తిగా చార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా 12 గంటల పాటు పనిచేస్తాయి. పది నిమిషాల చార్జింగ్ తో కూడా 100 నిమిషాల పాటు ఇందులో పాటలు వినవచ్చు. ఇందులో 11.2 మిల్లీ మీటర్ల డ్రైవర్ అందించారు. దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. ఇది పసుపు(Yellow), పచ్చ(Green), కాషాయ(Orange) రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. వీటికి సంబంధించిన సేల్ మరో 24 గంటల్లో అమెజాన్ లో ప్రారంభం కానుంది. ఆఫ్ లైన్ మార్కెట్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
రియల్ మీ ఎక్స్ టీ ఐకానిక్ కేస్..
మంగళవారం లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్ టీ మొబైల్ కు ఐకానిక్ కేస్ లను అక్టోబర్ నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రియల్ మీ తెలిపింది. పసుపు(Yellow), నలుపు(Black) రంగుల్లో మార్కెట్లోకి రానున్న వీటి ధర రూ.399గా ఉండనుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.