(Local) Sat, 24 Aug, 2019

మెట్రో రైలులో ప్రయాణించిన హీరో నితిన్!

June 22, 2019,   1:15 PM IST
Share on:

హైదరాబాద్ ట్రఫిక్స్ లో సామాన్య జనాలే కాకుండా అపుడప్పుడు మన సెలబ్రిటీస్ కూడా చిక్కుకుని కొంచం ఆర్భాటం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి  హైదరాబాద్ లో అనుకోకుండా భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ప్రముఖ  హీరో నితిన్ షూటింగ్ కోసం వెళుతున్న సమయంలో రాత్రి ట్రాఫిక్ లో ఇరుక్కపోవడంతో చేసేది లేక  ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ విషయాన్ని నితిన్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ట్రాఫిక్ కారణంగా తాను మెట్రో రైలులో ప్రయాణించానని, ఈ ప్రయాణం అద్భుతంగా కోనసాగిందని అని ఆయన పేర్కొన్నారు. దానితో రైలులో నితిన్ తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జంటగా రష్మిక మందన నటిస్తున్నారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.