(Local) Sun, 17 Nov, 2019

టిక్‌టాక్‌ నుంచి ఓ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది

November 05, 2019,   3:07 PM IST
Share on:
టిక్‌టాక్‌ నుంచి ఓ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది

టిక్‌టాక్‌ నుంచి ఓ స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేసింది. టిక్‌ టాక్‌ మాతృ సంస్థ ‘బైట్‌ డ్యాన్స్‌’ తన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేసింది. ‘స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3’ (నట్‌ ప్రో 3) పేరుతో ఈ మొబైల్‌ చైనా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నట్‌ ప్రో3లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. మెరుగైన సెల్ఫీల కోసం సెల్ఫీ లైటింగ్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. స్మార్టిసాన్‌ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 7 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. అయితే ఇది ఏ వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పనిచేస్తుందనేది సంస్థ వెల్లడించలేదు. 6.39 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తోంది. 

ఈ ఫోన్‌లో ముందు వైపు 4 ఇన్‌ 1 పిక్సెల్‌ బిన్నింగ్‌ సాంకేతికతతో 20 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 586 సెన్సర్‌తో 48 మెగాపిక్సెల్‌ కెమెరా తీసుకొస్తున్నారు. దీంతోపాటు వైడ్‌ యాంగిల్ సెన్సర్‌తో 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్‌ జూమ్‌ కోసం 2 ఎక్స్ ఆప్టికల్‌ జూమ్‌ కెమెరా ఉంటుంది. వీటితోపాటు టెలీ ఫొటో లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. వీటికి 5 ఎంపీ మాక్రో కెమెరా అదనం. దీంతో దగ్గరల్లోని వస్తువులను మెరుగ్గా ఫొటో తీయొచ్చు. ఈ మొబైల్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 

8 జీబీర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న మొబైల్‌ ధర 2,899 యువాన్లు (సుమారుగా రూ.29,000). 8 జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర 3,199 యువాన్లు (సుమారుగా రూ.32,000). 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర 3,599 యువాన్లు (సుమారుగా రూ.36,000). ప్రస్తుతానికి ఈ ఫోన్‌ చైనాలో మాత్రమే అమ్మకానికి ఉంది. ఇతర దేశాల్లో ఎప్పుడు అమ్మకానికి రానుందనే దానిపై స్పష్టత లేదు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.