(Local) Thu, 05 Dec, 2019

బైక్ తోలేసిన కుక్క..క్యా బాత్ హై అంటున్న నెటిజన్లు

October 28, 2019,   10:21 AM IST
Share on:
బైక్ తోలేసిన కుక్క..క్యా బాత్ హై అంటున్న నెటిజన్లు

బైక్ నడుపుతున్న కుక్క వీడియో తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వెనుక ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కించుకుని..ఎంచక్కా ఆ కుక్క హైవైపై బైకు తోలుతుటుంది. ఇప్పటికే ఈ వీడియోకు వెల కొద్దీ లైకులు, షేర్లూ లభించాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. భలేగా డ్రైవ్ చేస్తోందని కుక్కను పొగుడుతూనే.. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు. మరి కొంత మంది మాత్రం రోడ్లపై ఇలాంటి ఫీట్లు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఎవరు చిత్రీకరించారు అనే అంశంపై క్లారిటీ లేదు. అయితే కొంత మంది మాత్రం ఇది బ్రెజిల్‌లో తీసిన వీడియో అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నరు. వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.

https://twitter.com/klara_sjo/status/1188078803660226561

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.