(Local) Wed, 16 Oct, 2019

రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన వీవో

September 20, 2019,   4:19 PM IST
Share on:
రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్  చేసిన  ...

వివో వీ17 ప్రో పేరుతో  వీవో సంస్థ తన స్మార్ట్ ఫోన్‌ను గ్రాండ్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. తొలిసారి రెండు  పాప్ అప్ సెల్పీ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలోనే ఇదో అద్భుతమైన ఆవిష్కరణ అంటూ అభిప్రాయపడ్డారు. 

వివో వీ17 ప్రో మొత్తం ఆరు కెమెరాలు ఉండనున్నాయి. రెండు సెల్ఫీ, నాలుగు బ్యాక్ కెమెరాలు ఉండనున్నాయి.యర్ కెమెరా సెటప్ 48 మెగాపిక్సెల్ వరకు ఉండనుంది. ఈ ఫోన్లను ఈనెల 27 నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభించారు. దీని ధర రూ.29,900గా నిర్ణయించారు. 

వివో వీ17 ఫీచర్స్ : 

డిస్‌ప్లే: 6.4 అంగుళాలు

ర్యామ్ : 8 జీబీ

బ్యాటరీ: 4,100 ఎంఏహెచ్

ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ

కెమెరాలు : రెండు ఫ్రంట్ (38+8)

                  నాలుగు బ్యాక్ (48+13+8+2 మెగా పిక్సెల్స్)

     ధర: రూ.29,990

సంబంధిత వర్గం
త్వరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్
త్వరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.