(Local) Tue, 17 Sep, 2019

త్వరలో వాట్సాప్  స్టేటస్ ను షేర్ చేసుకునే వెసులుబాటు

June 27, 2019,   1:10 PM IST
Views: 139
Share on:
త్వరలో వాట్సాప్  స్టేటస్ ను షేర్ చేసుకునే వెసులుబా ...

వాట్సాప్ లో పెట్టె  స్టేటస్ మెసేజ్లను ఇక పై నేరుగా ఫేస్బుక్ లో  కూడా సెట్ చేసుకునే అవకాశం లభించబోతోంది. కేవలం ఫేస్బుక్ మాత్రమే కాదు, Instagramతో పాటు, Gmail, Google Photos వంటి  ఇతర సర్వీసుల తో కూడా మీ ఫేస్బుక్ స్టేటస్ షేర్ చేసుకునే వెసులుబాటు అతి త్వరలో రాబోతుంది. దీనికోసం మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ వాట్స్ అప్ తో లింక్ చేయాల్సిన పనిలేదు. ఇది చాలా సులభంగా పనిచేస్తుంది.  సహజంగా మనం Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లను వాడేటప్పుడు వివిధ అంశాలను షేర్ చేసుకోవటానికి Share  మెనూ కనిపిస్తుంది కదా. సరిగ్గా దాని ద్వారా ప్రస్తుతం మీరు వాడుతున్న స్టేటస్ మెసేజ్లను వివిధ అప్లికేషన్ల కోసం చేసుకునే వెసులుబాటు అందించబడుతుంది.

అయితే మిగతా అప్లికేషన్లతో పోలిస్తే, Whatsappని  చాలామంది వ్యక్తిగతమైన అవసరాలకు, స్నేహితులతో కంటెంట్ షేర్ చేసుకోవటానికి వినియోగిస్తూ ఉంటారు కాబట్టి,  ఇలా స్టేటస్ షేర్ చేసుకునే అవకాశం పబ్లిక్ గా కల్పిస్తే ఎదురయ్యే ఇబ్బందులను కూడా వాట్సప్ సంస్థ దృష్టిలో పెట్టుకున్నట్లు  తెలుస్తోంది.సరిగ్గా ఐదేళ్ల క్రితం Whatsappని Facebook  సంస్థ సొంతం చేసుకోవడం జరిగింది. అప్పటినుండి వాట్సప్ అప్లికేషన్ లో అనేక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి.  ఆడియో కాల్, వీడియో కాల్ వంటి కీలకమైన సదుపాయాలతోపాటు, వాట్సాప్ గ్రూప్స్ లో కేవలం అడ్మిన్స్ మాత్రమే పోస్ట్ చేయగలిగే విధంగా ఏర్పాటు కూడా వచ్చింది. అలాగే స్టిక్కర్స్,  వాట్సాప్ పేమెంట్స్ వంటి కీలకమైన సదుపాయాలు కూడా ఈ ఐదేళ్ల కాలంలో వాట్సాప్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించడం జరిగింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.