(Local) Mon, 18 Nov, 2019

వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!

September 06, 2019,   3:13 PM IST
Share on:
వాట్సాప్‌ న్యూ అప్డేట్.....!

టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు ఆ టెక్నాలజీని వాడుకుంటూ అప్డేట్ అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. స్మార్ట్ ఫోన్ అనేది వచ్చాక చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారివరకు ఫోన్ వాడకం అనేది జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయింది. అసలే స్మార్ట్ ఫోన్ ఇంకా అందులో కొన్ని అప్స్ అనేవి లేకుండా ఉంటె రోజు గజిబిజిగా నడుస్తుంది అనడంలో తప్పేం లేదు. అప్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాట్సాప్ గురించే... ఏ విషయాన్ని చేరవేయాలన్నా.. తెలుసుకోవాలన్నా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి తగ్గట్టుగానే వాట్సాప్‌ కూడా తన యూజర్లకు సరికొత్త పీచర్స్ అందుబాటులోకి తెస్తూనే ఉంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటూ తాజాగా మరో ఫీచర్ తీసుకువచ్చింది.  ఇక నుంచి వాట్సాప్‌లో వచ్చే ఆడియో మెసేజ్‌లు వినాలంటే యాప్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్ బార్‌లోనే వినే అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ముందు టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే నోటిఫికేషన్ బార్‌లో చూసుకుని అక్కడి నుంచి రిప్లే ఇచ్చే అవకాశం ఉండేది. తాజాగా ఆడియో మెసేజ్ కూడా వినేందుకు అవకాశం ఇస్తోంది. దీంతో మనం మన పనులు చేసుకుంటూనే ఆడియో మెసేజీలు వినే సదుపాయం తర్వలో వచ్చేస్తోంది. 

సంబంధిత వర్గం
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
వాట్సాప్‌ త్వరలో డిజిటల్‌ చెల్లింపుల సేవలు ప్రారంభ ...
వాట్సాప్‌ త్వరలో డిజిటల్‌ చెల్లింపుల సేవలు ప్రారంభ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.