(Local) Mon, 16 Sep, 2019

షియోమీ నుండి 108 ఎంపీల కెమెరా

September 07, 2019,   1:02 PM IST
Views: 42
Share on:
షియోమీ నుండి 108 ఎంపీల కెమెరా

చాలా మంది మొబైల్ లో ఫోటోలు తీసుకోవడమంటే సరదా . కొన్నిసార్లు మొబైల్ లో ఫొటోల నాణ్యత లేక  చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక అటువంటి బాధల నుంచి త్వరలోనే విముక్తి కలగనుంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ రంగంలో సంచలన నిర్ణయాలతో అతి తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు అందిస్తున్న షియోమి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ త్వరలోనే 108 ఎంపీ కెమెరా కలిగిన  మరో నాలుగు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లతో కెమెరా క్వాలిటి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే మార్గంలో మరింత ఎక్కువ క్వాలిటి కలిగిన ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ నాలుగు స్మార్ట్ ఫోన్లకు డ్రాకో, టుకానా, సిమి, ఉమి అనే కోడ్ పెట్టారు. 

ఇప్పటికే షియోమీ తన సంస్థ నుంచి REDMI Note PRO తో 48 ఎంపీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. గత నెలలో 64 ఎంపీ కెమెరా కలిగిన ఫోన్‌కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక అంతటితో ఆగకుండా ఏకంగా 108 ఎంపీల కెమెరా కలిగిన ఫోన్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే DSLR కంటే క్లారిటీగా దీంట్లో ఫొటోలు తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల శామ్ సాంగ్ కూడా ఇటువంటి ఫోన్ లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే అది ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఒకవేళ షియోమి ముందుగా తీసుకువస్తే మాత్రం అతి ఎక్కువ క్లారిటీ కెమెరా ఫోన్ విడుదల చేసిన మొదటి  సంస్థగా పేరు పొందనుంది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.