(Local) Mon, 21 Oct, 2019

జనసేన సమీక్ష సమావేశాలు వాయిదా

June 06, 2019,   4:05 PM IST
Share on:
జనసేన  సమీక్ష సమావేశాలు వాయిదా

శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పరాజయాలకు జనసేన పార్టీ గురువారం నిర్వహించదలచిన సమీక్ష సమావేశాలు వాయిదా పడ్డాయి. అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలు కావటమే దీనికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి సమీక్ష ఎప్పుడు జరుగుతుందో తర్వాత ప్రకటిస్తామని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో రాజోలు మినహా మిగిలిన 174 స్థానాల్లో జనసేన ఓటమి పాలైంది. ఒకే ఒక లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం శాసన సభ స్థానాలకు పోటీ చేసి పరాభవం పాలయ్యారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.