(Local) Sun, 12 Jul, 2020

కేబుల్ టివి సేవల కోసం పే9 మొబైల్‌ యాప్‌

June 06, 2019,   10:43 AM IST
Share on:
కేబుల్ టివి సేవల కోసం పే9 మొబైల్‌ యాప్‌

కేబుల్‌ టీవీ రంగానికి అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు ఒక పూర్తిస్థాయి టెక్నాలజీ ప్లాట్‌ఫాంగా పే9 మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని పే9 ఫౌండర్‌, సీఈఓ బాలవెంకటేశ్వరరావు సంకురాత్రి తెలిపారు.మాదాపూర్‌లోని శ్రీరామకృష్ణ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో పే9 మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు.

అనంతరం సీఈఓ మాట్లాడుతూ కేబుల్‌టీవీ రంగంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్‌ యాప్‌ద్వారా సేవలు పొందేఅవకాశాన్ని పే9యాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు.హైదరాబాద్‌ నగరమే కాకుండా దేశంలోని ఏ నగరమైనా, ప్రాంతంలో ఉన్నా కేబుల్‌ ఆపరేటర్ల సేవల కు మొబైల్‌ యాప్‌ ద్వారా అందించేందుకు ఒక పెద్ద ప్లాట్‌ఫామ్‌ను రూపొందించామన్నారు.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్మకాలకు ఎంతో ప్రాచుర్యం పొందిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ తరహాలోనే పే9 యాప్‌ ద్వారా అమ్మకందారులు, కొనుగోలుదారులకు ఇదొక వేదికగా ఉంటుందన్నారు.గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు.ప్రస్తుతం పే9 యాప్‌లో మీ ప్రాంతానికి సేవలను అందిస్తున్న కేబుల్‌ ఆపరేటర్‌ను ఎంపిక చేసుకొని, వారు ఇచ్చిన సెట్‌టాప్‌ బాక్సును యాక్టివ్‌ చేసుకొని మీకు నచ్చిన చానల్స్‌ను ఎంపిక చేసుకొని వాటికి మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుందని, ఇదంతా యాప్‌ ద్వారానే పూర్తిచేసేలా దీన్ని రూపొందించామన్నారు.ఇప్పటికే నగరంలో ఉన్న ఎంఎ్‌సఓలు, కేబుల్‌టీవీ ఆపరేటర్లతో చర్చించామన్నారు.

దీన్ని కేబుల్‌ టీవీని వినియోగిస్తున్న వారికి అందుబాటులోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పే9 ఫౌండర్‌, సీఈఓ తెలిపారు.కేబుల్‌ ఆపరేటర్ల, చానళ్ల ఎంపిక, డబ్బులు చెల్లింపు వంటివన్నీ యాప్‌లోనే నిర్వహించుకునే సులభమైన విధానంలో యాప్‌ను తెచ్చామన్నారు.కార్యక్రమంలో సీఎండీ కాశీవిశ్వనాథం బొద్దానితో పాటు పలువురు కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.